BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 07:27 pm
Posted by : K MAHESH

వ్యవసాయ మోటార్ల చోరీ ముఠా అరెస్ట్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / మోత్కూరు
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 07:27 PM
15 వీక్షణలు

రూ.2 లక్షల విలువైన 18 మోటార్లు స్వాధీనం.. ఎర్టిగా కారు, నాలుగు సెల్‌ఫోన్లు పట్టివేత

మోత్కూరు, నవంబర్ 11:

వ్యవసాయ బోరు మోటార్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను మోత్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు పోలీస్‌స్టేషన్ల పరిధిలో వరుసగా చోటుచేసుకున్న వ్యవసాయ మోటార్ల చోరీ కేసులను ఛేదించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రామన్నపేట సీఐ ఎం.రవి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ మోటార్ల చోరీలకు పాల్పడుతున్న నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనాజిపురం ఎక్స్‌రోడ్డు వద్ద ఎస్సై కె.సతీష్ నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నాలుగు పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన వ్యవసాయ మోటార్ల చోరీలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుల నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన 18 వ్యవసాయ మోటార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు చోరీలకు ఉపయోగించిన ఎర్టిగా కారు, నాలుగు సెల్‌ఫోన్లు, చోరీకి వినియోగించే పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

వ్యవసాయ అవసరాల కోసం పొలాల్లో ఏర్పాటు చేసుకున్న మోటార్లు వరుసగా చోరీకి గురవుతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేపట్టడంతో ముఠా పట్టుబడింది.

నలుగురు నిందితుల అరెస్టుతో నాలుగు పోలీస్‌స్టేషన్ల పరిధిలోని చోరీ కేసుల దర్యాప్తులో పురోగతి సాధించినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.