BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 12:05 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వ్యవసాయ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్.. 84 మోటార్లు స్వాధీనం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
20 Nov, 2026 - 12:05 PM
16 వీక్షణలు

ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్ట్.. మరో నలుగురు బాలురు అదుపులోకి

రూ.18.44 లక్షల విలువైన మోటార్లు, నాలుగు వాహనాలు స్వాధీనం

నర్సంపేట, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ నీటి మోటార్లను అపహరిస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు మరో నలుగురు బాలురను చట్టంతో విభేదించిన బాలురుగా (CCL) అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.18,44,800 విలువైన 84 విద్యుత్ నీటి మోటార్లతో పాటు దొంగతనాలకు ఉపయోగించిన నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు వివరాలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

గురువారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో నర్సంపేట సబ్‌ఇన్‌స్పెక్టర్ రాజన్ బాబు సిబ్బందితో కలిసి రాజుపేట క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఒక ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వరంగల్ సీసీఎస్ పోలీసుల సహకారంతో విచారించగా, నిందితులు డీజే ఆపరేటర్లుగా, స్టేజ్ డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు వెల్లడైంది. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వ్యవసాయ మోటార్లను దొంగిలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపూర్, నెక్కొండ, ములుగు మండలాల పరిధిలోని శివారు గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ నీటి మోటార్లను అపహరించినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

దొంగిలించిన మోటార్లను విక్రయించేందుకు రాజుపేట గ్రామ శివారులోని చెట్ల పొదల్లో దాచిపెట్టినట్లు నిందితులు వెల్లడించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా 84 విద్యుత్ నీటి మోటార్లు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన ప్రధాన నిందితులు:

  1. హంస ప్రశాంత్ (27)

  2. అన్న శివప్రసాద్ (22)

  3. ఎస్.కె. దస్తగిరి అలియాస్ షైర్ (20)

వీరితో పాటు మరో నలుగురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

  • 84 విద్యుత్ నీటి మోటార్లు – రూ.18,44,800 విలువ

  • ట్రాలీ ఆటో – 1

  • ప్యాసింజర్ ఆటో – 1

  • పల్సర్ మోటార్ సైకిల్ – 1

  • షైన్ మోటార్ సైకిల్ – 1

రైతులకు పోలీసుల సూచనలు

రైతులు తమ వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సూచించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినా, మోటార్ల దొంగతనాలు జరిగినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. దొంగతనాల నివారణకు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఈస్ట్ జోన్ డీసీపీ నగదు రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, నర్సంపేట ఇన్‌స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్, సబ్‌ఇన్‌స్పెక్టర్ రాజన్ బాబు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు హరికృష్ణ, రాఘవేందర్ రావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.