BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 03:29 pm
Posted by : కూనురు మధు

వీధి కుక్కల దాడిలో మేక పిల్లలు మృతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
06 Nov, 2026 - 03:29 PM
76 వీక్షణలు

ఆరెగూడెంలో ఘటన.. వీధి కుక్కల బెడదను అరికట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తి


NTODAY NEWS: చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామంలో వీధి కుక్కలు దాడి చేయడంతో పది మేక పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆరూరి నరసింహ సత్తయ్యకు చెందిన మేకల దొడ్డిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి పది మేక పిల్లలను చంపాయి. ఈ ఘటనలో సుమారు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రెక్కల కష్టంతో మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న తనకు ఈ ఘటన తీరని నష్టాన్ని మిగిల్చిందని బాధితుడు వాపోయాడు. గ్రామంలో వీధి కుక్కల సంచారం పెరిగి ప్రజలు, పశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, బాధిత మేకల పెంపకందారుడికి ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.