BREAKING
thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు thumb ● విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం thumb ● మహిళా సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం: సర్పంచ్ ధరావత్ కైక thumb ● కేసముద్రం మండల స్వేరో అధ్యక్షుడిగా మంద ప్రవీణ్ స్వేరో ఎన్నిక thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు కేసముద్రం విద్యార్థి అక్షయ్ కుమార్ ఎంపిక thumb ● ఇండోర్ ఎనిమిదేళ్ల రికార్డుకు బ్రేక్.. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబై thumb ● హామీ ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడికి వీల్‌చైర్ అందజేత thumb ● రోడ్డుపై అడ్డువచ్చిన గేదెలు.. బైక్ అదుపుతప్పి యువకుడి మృతి thumb ● సంక్రాంతి ప్రయాణాలకు సిద్ధం.. 14 తేదీ నుంచి రైలు టికెట్ల బుకింగ్స్ ప్రారంభం! thumb ● హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా మహేశ్ భగవత్ నియామకం thumb ● కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్‌ను పరామర్శించిన మాజీ జిల్లా అధ్యక్షుడు
Test 4
Date of Publish : 12 November 2026, 06:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మురసు తుఫాన్‌ బాధిత రైతులందరికీ ప్రభుత్వ సాయం:

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 06:17 PM
3 వీక్షణలు

మంత్రి గొట్టిపాటి ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మురసు తుఫాన్‌ ప్రభావంతో జరిగిన నష్టంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, రహదారులు-భవనాల శాఖల అధికారులతో సమావేశమై తుఫాన్‌ కారణంగా జరిగిన నష్టం, అనంతర పరిస్థితులపై చర్చించారు. తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. గృహ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ దాదాపు పూర్తయిందని అధికారులు వివరించారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులను మరింత వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరా లేక సాగునీరు అందక ఏ ఒక్క రైతు పంట కూడా దెబ్బతినకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తుఫాన్‌ కారణంగా వరి, పత్తి, మిరప, మినుము, శనగ, పొగాకు తదితర పంటలకు జరిగిన నష్టాన్ని పంటల వారీగా అంచనా వేయాలని ఆదేశించారు. నష్టపోయిన పంటల విస్తీర్ణంతో పాటు బాధిత రైతులందరి వివరాలను నమోదు చేయాలని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ నష్టాన్ని పరిశీలించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. తుఫాన్‌ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వ పరంగా అండగా నిలిచి తగిన సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.