పట్టభద్రులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ కోరారు. బుధవారం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డిగ్రీ పట్టభద్రులను కలిసి ఓటరు నమోదుపై వివరించారు. నవంబర్ 6వ తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అవిశెట్టి శంకరయ్య, శీలా రాజయ్య, బూరుగు విజయ్ కుమార్, చింతపల్లి కృష్ణయ్య, రమేష్, బెల్లపు హరిబాబు, గోపికృష్ణ, శ్రీను, అజయ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.