BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 06:41 pm
Posted by : కూనురు మధు

కల్లాల్లోనే మొలకెత్తుతున్న ధాన్యం.. కొనుగోళ్ల కోసం రైతుల పోరుబాట!

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 Nov, 2026 - 06:41 PM
56 వీక్షణలు


వెలిమినేడులో కొనుగోలు కేంద్రం ఎదుట ధర్నా.. రైతు వేదికకు తాళం

నెల రోజులుగా ఎదురుచూపులే.. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోలేక, ప్రభుత్వ కొనుగోళ్లు లేక అన్నదాతల ఆవేదన

చిట్యాల : ఎన్  టుడే న్యూస్ న్యూస్


ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వరి కోతలు పూర్తయి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోళ్ల కోసం కల్లాల్లోనే నిల్వ ఉంచిన ధాన్యం మొలకెత్తుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా నిర్వహించి, కొనుగోళ్లు ప్రారంభించే వరకు రైతు వేదికను తెరవనివ్వబోమంటూ తాళం వేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రైవేటు వ్యాపారులు ధాన్యాన్ని మంచి ధరకు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, వారికి విక్రయించుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.


అటు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోలేక, ఇటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం నిల్వ ఉండటంతో వాతావరణ ప్రభావానికి మొలకలు వస్తున్నాయని, దీంతో పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చిన సమయంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని, గిట్టుబాటు ధరకు ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారంలో మరింత జాప్యం జరిగితే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.