ఊరుమడ్లలో అక్టోబర్ 2న గ్రామ సభ
- జల సంరక్షణ పనులపై ప్రత్యేక చర్చ
- ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన
- హాజరు కావాల్సిన శాఖలు, సిబ్బంది
గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలి
ఊరుమడ్ల, అక్టోబర్ 1: ఊరుమడ్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ఉదయం 9 గంటలకు VBG RAM గ్రామ సభ సమావేశం నిర్వహించనున్నారు. గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
గ్రామ సభలో Peoples Plan Campaign, GPDP, VGPP, 16వ ఆర్థిక సంఘం నిధులు, స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ నాటే కార్యక్రమం, స్వచ్ఛత దివస్, RGSA, జలసిరి పనులు తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే వివిధ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలపై లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట ఏర్పాటు చేయడంపై గ్రామ సభలో అవగాహన కల్పించనున్నారు. కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, డ్రెయిన్ ఎండ్ పాయింట్ ఇంకుడు గుంతలు, పంట కాలువలు, ఫీడర్ చానెల్స్, చెరువులు, కాలువల పూడికతీత, వ్యవసాయ భూములకు వెళ్లే రహదారుల గ్రావెల్ నిర్మాణం, చేపల కుంటలు, బోర్‌వెల్ రీఛార్జ్ ఇంకుడు గుంతలు తదితర జల సంరక్షణ పనులపై చర్చించనున్నారు.
ఈ పనులను చేపట్టేందుకు ఆసక్తి ఉన్న గ్రామస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పండ్ల తోటలు, పూల తోటలు, కూరగాయల పందిరి సాగు, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్ల నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తులను కూడా స్వీకరించనున్నారు.
ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు–2026పై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా నాలుగు రకాల చెత్తను వేర్వేరుగా వేరు చేసి నిర్వహించే విధానాన్ని వివరించనున్నారు.
గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మహిళా ప్రతినిధులు, గ్రామస్థాయి సిబ్బంది, ప్రజలు సకాలంలో హాజరై గ్రామ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
అంగన్‌వాడీ టీచర్లు, రేషన్ డీలర్లు, ANMలు, ఆశా కార్యకర్తలు, FAలు, సీనియర్ మేట్లు, GPO, వాటర్ సప్లై సిబ్బంది (మిషన్ భగీరథ, స్థానిక), VOAలు, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, అటవీ శాఖ సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.