BREAKING
thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు
Date of Publish : 09 October 2026, 06:06 pm
Posted by : ADARI RAMA PRASAD

డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
09 Oct, 2026 - 06:06 PM
2 వీక్షణలు
గవరపాలెం: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని గవరపాలెంలోని డాక్టర్ హిమశేఖర్ స్కూల్‌లో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. విద్యార్థులు వివిధ దేవతామూర్తుల వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కె. సౌజన్య మాట్లాడుతూ దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని తెలిపారు. విద్యార్థులు సత్యం, ధర్మం, ధైర్యం, క్రమశిక్షణ వంటి సద్గుణాలను అలవర్చుకోవాలని సూచించారు. దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయం ద్వారా ధర్మం, న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తాయనే సందేశం అందుతుందని పేర్కొన్నారు.

పాఠశాల ప్రిన్సిపల్ పి. సురేష్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను చిన్ననాటి నుంచే విద్యార్థులకు తెలియజేయడం అవసరమన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక భావన, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు.

వేడుకల్లో భాగంగా విద్యార్థులు రంగురంగుల దుస్తులు, సంప్రదాయ అలంకరణలతో వివిధ దేవతామూర్తుల వేషధారణలో అలరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చాయి. విద్యార్థుల వేషధారణలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆసక్తిగా తిలకించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి. జగన్, ఇన్‌చార్జిలు భాను, స్వాతి, పీఈటీ ప్రేమ్, ఉపాధ్యాయులు ఇందిర, అనిత, లావణ్య, ప్రసన్న, వాణి, రూప, నాగలక్ష్మి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.