BREAKING
thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
Date of Publish : 24 September 2026, 04:46 am
Posted by : GOUTHAM RUDRARAPU

దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు

తెలంగాణ
/ సంగారెడ్డి / అమీన్‌పూర్
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
24 Sep, 2026 - 04:46 AM
0 వీక్షణలు

బీరంగూడ సమీపంలోని కిష్టారెడ్డిపేట, దుర్గానగర్ కాలనీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథుని మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు స్థానికులను విశేషంగా అలరించాయి.

చిన్నారులు, స్థానిక యువత ప్రదర్శించిన భక్తి నృత్యాలు, గణపతి స్తోత్ర పఠనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కాలనీలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించారు.

ఈ వేడుకలు దుర్గానగర్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ... కాలనీవాసులంతా ఒక్కటై గణేష్ నవరాత్రులను ఇంత వైభవంగా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని, ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో కాలనీ ప్రజల విఘ్నాలన్నీ తొలగి సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేపట్టారు. ఈ సంబరాల్లో కాలనీ మహిళలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.