BREAKING
thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● ఆర్టీసీలో కూటమి అభ్యర్థులను గెలిపించండి ఏఐటియుసి thumb ● రోడ్డుపై భిక్షాటన చేస్తున్న చిన్నారులను చేరదీసిన సీఐ thumb ● అనకాపల్లి ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా దాడి శ్రీకాంత్ thumb ● వృద్ధుల సంఘాల ఏర్పాటులో విశేష కృషి.. thumb ● గులాం నబీని పరామర్శించిన మైనార్టీ నాయకులు thumb ● ఘనంగా రాచకొండ దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా
Date of Publish : 06 October 2026, 06:59 pm
Posted by : కూనురు మధు

తైక్వాండోలో గ్రీన్ గ్రోవ్ విద్యార్థుల పతకాల పంట

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
06 Oct, 2026 - 06:59 PM
31 వీక్షణలు

జిల్లా స్థాయి పోటీల్లో ఏడుగురికి పతకాలు

చిట్యాల, ఎన్‌టుడే న్యూస్‌: నల్గొండ జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ యునైటెడ్‌ నల్గొండ డిస్ట్రిక్ట్‌ క్యూరుగీ అండ్‌ పూమ్సే ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్‌ గ్రోవ్‌ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.

అండర్‌-14 బాలుర విభాగంలో ఏడో తరగతి విద్యార్థి రాధారపు ప్రణయ్‌ మణిదీప్‌ స్వర్ణ పతకం సాధించగా, బొక్క శ్రీ విష్ణువర్ధన్‌, ఇల్లందుల విఘ్నేష్‌ రజత పతకాలు కైవసం చేసుకున్నారు. బొక్క శ్రీ హర్షవర్ధన్‌రెడ్డి కాంస్య పతకం సాధించాడు.

అండర్‌-14 బాలికల విభాగంలో నాలం లోచన అనన్య, జిట్ట మిథిలా రజత పతకాలు సాధించగా, బత్తుల వేదాంశిత కాంస్య పతకాన్ని దక్కించుకుంది.

పతకాలు సాధించిన విద్యార్థులను చిట్యాల ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, పాఠశాల డైరెక్టర్‌ జూలకంటి వేణుగోపాల్‌రెడ్డి అభినందించి పతకాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. చిన్నతనం నుంచే తైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవడం ఎంతో అవసరమని, వాటివల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, ఏకాగ్రత పెంపొందుతాయని అన్నారు. క్రీడలను కేవలం పతకాల సాధనకే పరిమితం చేయకుండా శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు వినియోగించుకోవాలని సూచించారు.

జిల్లా స్థాయి పోటీల్లో గ్రీన్‌ గ్రోవ్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం అభినందనీయమని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ జాన్‌రెడ్డి, తైక్వాండో మాస్టర్‌ పట్టేడ సుధాకర్‌, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము తదితరులు పాల్గొన్నారు.