రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు గ్రీన్ గ్రోవ్ విద్యార్థుల ఎంపిక
NTODAY NEWS : చిట్యాల
నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో సెప్టెంబర్ 29న నిర్వహించిన రాష్ట్రస్థాయి హాకీ క్రీడాకారుల ఎంపికలో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆగు దివ్యభాను అండర్–17 బాలికల విభాగంలో, 6వ తరగతి విద్యార్థిని ఏర్పుల ఊహస్మిత అండర్–14 బాలికల విభాగంలో, 8వ తరగతి విద్యార్థి గంగాపురం మనస్విక్ అండర్–14 బాలుర విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి హాకీ క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమన్నారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, చిట్యాల ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ఏవో పోల గోవర్ధన్, వ్యాయామ ఉపాధ్యాయుడు గంగాపురం రాము, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు