BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 06:51 pm
Posted by : K MAHESH

అయ్యప్ప సేవలో ఆదర్శంగా గురుస్వామి ఆకోజు శ్రీనివాస్

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 06:51 PM
14 వీక్షణలు

18వ పడిపూజ సందర్భంగా సొంత ఖర్చులతో అయ్యప్ప స్వాములకు బిక్ష, అల్పాహారం, అన్నదాన సేవలు

కురవి, నవంబర్ 11:

భక్తి మార్గంలో సేవా భావమే పరమార్థమని చాటుతూ అయ్యప్ప స్వాములకు నిరంతరం అన్నదానం, అల్పాహార సేవలు అందిస్తున్నాడు మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం ఉప్పరగూడెం గ్రామానికి చెందిన శ్రీ మణికంఠ పీఠం గురుస్వామి ఆకోజు శ్రీనివాస్. అయ్యప్ప స్వామిపై ఉన్న అపారమైన భక్తితో పాటు తోటి స్వాములకు సేవ చేయాలనే సంకల్పంతో తన సొంత ఖర్చులతో వివిధ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

తన 18వ పడిని పురస్కరించుకుని అయ్యప్ప దీక్ష స్వీకరించిన స్వాములకు ఉప్పరగూడెంలోని శ్రీ మణికంఠ పీఠం కుటీరంలో ప్రత్యేకంగా బిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీక్షలో ఉన్న స్వాములందరికీ భక్తిశ్రద్ధలతో బిక్ష, అల్పాహారం అందిస్తూ సేవాభావాన్ని చాటుకుంటున్నారు.

ప్రతి రోజూ శ్రీ మణికంఠ పీఠం కుటీరంలో అయ్యప్ప స్వాముల కోసం అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్షా కాలంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే స్వాములకు అవసరమైన ఆతిథ్యం కల్పిస్తూ, అన్నదానాన్ని పవిత్రమైన సేవగా భావించి కొనసాగిస్తున్నారు. అయ్యప్ప స్వాములను తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారికి స్వయంగా సేవలు అందిస్తున్నారు.

పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అన్నదానం, అల్పాహార పంపిణీ వంటి సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎలాంటి ఆడంబరాలకు తావులేకుండా పూర్తిగా తన సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థానికంగా అయ్యప్ప భక్తుల ప్రశంసలు అందుకుంటున్నారు.

ఈ సందర్భంగా గురుస్వామి ఆకోజు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. తోటి స్వాములకు బిక్ష, అల్పాహారం, అన్నదానం అందించడం ద్వారా కలిగే సంతృప్తి ఎంతో గొప్పదని తెలిపారు. ఈ దేహంలో ప్రాణం ఉన్నంతవరకు అయ్యప్ప స్వామి సేవలోనే కొనసాగుతానని తన భక్తి భావాన్ని వెల్లడించారు.

గురుస్వామి ఆకోజు శ్రీనివాస్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అయ్యప్ప భక్తులు అభినందిస్తున్నారు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నారు.

స్వామియే శరణం అయ్యప్ప!