రోడ్డు ప్రమాదంలో గాయపడిన సైదులును పరామర్శించిన గుత్తా అమిత్ రెడ్డి
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
ఉరుమడ్ల, సెప్టెంబర్ 23: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఉయ్యాల లింగయ్య సోదరుడు ఉయ్యాల సైదులు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి బుధవారం హయత్‌నగర్‌లోని సైదులు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
సైదులు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని గుత్తా అమిత్ రెడ్డి ఆకాంక్షించారు.