BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 11:49 am
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్‌లో శాస్త్రీయ వేస్ట్ ఆడిట్‌కు GWMC–MSSRF శ్రీకారం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
20 Nov, 2026 - 11:49 AM
13 వీక్షణలు

90 ఇళ్లతో పాటు మార్కెట్లు, హోటళ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో సర్వే

వరంగల్, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

వరంగల్ నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC), ఎంఎస్ఎస్‌ఆర్‌ఎఫ్ (MSSRF) సంయుక్తంగా శాస్త్రీయ వేస్ట్ ఆడిట్‌కు శ్రీకారం చుట్టాయి.

వెల్‌కమ్ ట్రస్ట్ (యూకే) ఆర్థిక సహకారంతో, ఐఐటీ మద్రాస్, శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ భాగస్వామ్యంతో ఈ పరిశోధన చేపడుతున్నారు. ఇందులో భాగంగా 90 ఇళ్లతో పాటు మార్కెట్లు, హోటళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య సంస్థల్లో వ్యర్థాల ఉత్పత్తి, సేకరణ, వర్గీకరణ, రీసైక్లింగ్ విధానాలపై సమగ్ర సర్వే నిర్వహించనున్నారు.

ఈ అధ్యయనంలో పాల్గొనే స్వయం సహాయక సంఘాల సభ్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగం విద్యార్థి వాలంటీర్లకు ఈ నెల 19, 20 తేదీల్లో దివ్యదీప్తి భవన్‌లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం అధ్యయనాన్ని ఏడు వారాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ పరిశోధన ద్వారా నగరంలో వ్యర్థాల నిర్వహణ తీరుపై శాస్త్రీయ సమాచారం సేకరించి, మెరుగైన పారిశుద్ధ్య సేవల రూపకల్పనకు చర్యలు తీసుకోనున్నారు. తద్వారా ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుందని భావిస్తున్నారు.