BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 26 August 2026, 06:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హెచ్ఐవీ నివారణకు కీలక ముందడుగు..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Aug, 2026 - 06:15 PM
99 వీక్షణలు

హెచ్ఐవీ నివారణకు కీలక ముందడుగు.. డాక్టర్ రెడ్డీస్‌కు లెనాకాపవిర్‌ తయారీ అనుమతి

హైదరాబాద్, ఆగస్టు 26: హెచ్ఐవీ వ్యాప్తి నివారణలో కీలకమైన లెనాకాపవిర్‌ జెనరిక్ ఇంజెక్షన్ తయారీ, విక్రయాలకు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు అనుమతి లభించింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్పత్తి, మార్కెటింగ్‌కు కమిటీ ఆమోదం తెలిపింది. డాక్టర్ రెడ్డీస్‌తో పాటు ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌కు కూడా ఈ అనుమతి లభించింది. అయితే మార్కెట్లోకి విడుదల చేసిన తర్వాత నాలుగో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించి వివరాలను సమర్పించాలని సూచించింది.

హెచ్ఐవీ ముప్పు అధికంగా ఉన్న వారు ఈ ఇంజెక్షన్‌ను ఏడాదికి రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం 35 కిలోల బరువు ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

భారీగా తగ్గనున్న ధరలు

అంతర్జాతీయ ఫార్మా సంస్థ గిలీడ్ సైన్సెస్‌కు లెనాకాపవిర్‌పై పేటెంట్ హక్కులు ఉన్నాయి. అయితే భారత్‌తో పాటు 120 అల్పాదాయ దేశాల్లో రాయల్టీ లేకుండా ఈ మందును తయారు చేసేందుకు పలు సంస్థలకు లైసెన్సులు ఇచ్చింది.

ప్రస్తుతం అమెరికా, యూరప్ దేశాల్లో ఈ ఔషధానికి అయ్యే వార్షిక వ్యయం రూ.27 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంది. భారత్‌లో జెనరిక్ తయారీ ప్రారంభమైతే ప్రస్తుత ధరలతో పోలిస్తే 50 నుంచి 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఔషధ రంగ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆరిజెన్ ఫార్మాకు భారీ ఒప్పందం

డాక్టర్ రెడ్డీస్ అనుబంధ సంస్థ ఆరిజెన్ ఫార్మా అంతర్జాతీయ కంపెనీ నుంచి భారీ తయారీ ఒప్పందాన్ని దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం దీర్ఘకాలం పాటు స్టెరైల్ ఇంజెక్టబుల్స్, బయోలాజిక్స్ తయారు చేసి సరఫరా చేయనుంది. ఒప్పంద నిబంధనల కారణంగా భాగస్వామ్య సంస్థ వివరాలను వెల్లడించలేదు.