BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:59 pm
Posted by : K MAHESH

ట్రంప్‌కు దీపావళి కానుకగా హనుమాన్ చాలీసా

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 05:59 PM
20 వీక్షణలు

అమెరికా అధ్యక్షుడికి భారత వ్యాపారవేత్త విశాల్ గొండల్ ప్రత్యేక బహుమతి

వాషింగ్టన్ (ఎన్ టుడే న్యూస్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత వ్యాపారవేత్త విశాల్ గొండల్ ప్రత్యేక బహుమతిని అందజేశారు. దీపావళి వేడుకల సందర్భంగా తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా ప్రతిని ట్రంప్‌కు బహూకరించారు.

ఈ సందర్భంగా విశాల్ గొండల్ స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు. కోట్లాది మంది భక్తులు ధైర్యం, బలం, శక్తి కోసం పఠించే హనుమాన్ చాలీసాను బహుమతిగా అందించడం గర్వంగా ఉందన్నారు.

భారత్, అమెరికా దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ప్రపంచవ్యాప్తంగా చీకటిపై వెలుగు విజయం సాధించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

దీపావళి వేడుకల సందర్భంగా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా హనుమాన్ చాలీసాను బహూకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.