BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 30 September 2026, 09:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఫ్యాక్టరీ సెంటర్‌లో తెరిచి ఉన్న ఎలక్ట్రికల్ కంట్రోల్ బాక్స్ తో పొంచి ఉన్న ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Sep, 2026 - 09:18 PM
3 వీక్షణలు

ప్రమాదం జరగకముందే భద్రతా చర్యలు చేపట్టాలి: కాంగ్రెస్ నేత పల్లెపాటి శ్రీనివాసరావు

తిరువూరు: ఫ్యాక్టరీ సెంటర్‌లోని వైన్స్‌ షాప్‌ సమీపంలో ఎలక్ట్రికల్‌ కంట్రోల్‌ బాక్స్‌ డోర్‌ లేకుండా తెరిచి ఉండటంపై తిరువూరు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, న్యాయవాది పల్లెపాటి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, విద్యార్థులు రాకపోకలు సాగించే ప్రాంతంలో విద్యుత్‌ కంట్రోల్‌ బాక్స్‌ ఇలా తెరిచి ఉండటం ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

వైన్స్‌ షాప్‌ వద్ద మద్యం సేవించే కొందరు వ్యక్తులు మద్యం మత్తులో కంట్రోల్‌ బాక్స్‌ సమీపంలోనే పడుకుంటున్నారని పల్లెపాటి తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ లీకేజీ లేదా ఇతర కారణాలతో ప్రమాదం జరిగితే ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

జాతీయ నాయకులు, మహానేతల విగ్రహాలు ఉన్న ప్రాంతంలోనే ఎలక్ట్రికల్‌ కంట్రోల్‌ బాక్స్‌ రక్షణ లేకుండా తెరిచి ఉండటం భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇదే ప్రాంతంలో చిన్నారులు, పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వస్తుంటారని తెలిపారు.

విద్యార్థులు, ప్రయాణికులు, స్థానిక ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత విద్యుత్‌ శాఖాధికారులు వెంటనే స్పందించాలని పల్లెపాటి శ్రీనివాసరావు కోరారు. తెరిచి ఉన్న ఎలక్ట్రికల్‌ కంట్రోల్‌ బాక్స్‌ను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.