BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 08:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర, కొత్తగూడెం బస్టాండ్లకు హైటెక్ హంగులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Nov, 2026 - 08:18 PM
11 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఆధునిక బస్ టెర్మినళ్ల నిర్మాణానికి ఆర్టీసీ ప్రణాళిక మరో 86 రద్దీ బస్టాండ్లు మోడల్ బస్ స్టేషన్లుగా అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 13 ప్రాంతాల్లో బస్ స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో హైటెక్ బస్ టెర్మినళ్లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ జాబితాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మధిర, కొత్తగూడెం బస్ స్టేషన్లకు చోటు లభించింది. దీంతో ఈ రెండు ప్రాంతాల బస్టాండ్లు ఆధునిక రూపు సంతరించుకోనున్నాయి. కార్పొరేట్ తరహాలో ఆధునిక సదుపాయాలు కొత్తగా అభివృద్ధి చేయనున్న హైటెక్ బస్ టెర్మినళ్లలో ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేయనున్నారు. ఇతర రవాణా మార్గాలతో అనుసంధానం కల్పించేలా బహుళ రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. బస్సుల నుంచి దిగిన ప్రయాణికులు రైల్వే స్టేషన్లు, ఇతర రవాణా కేంద్రాలకు సులభంగా చేరుకునేలా అనుసంధాన వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. షాపింగ్, వినోద కేంద్రాలు ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండే సమయంలో ఇబ్బందులు లేకుండా ఫుడ్ కోర్టులు, షాపింగ్ కేంద్రాలు, వినోద ప్రాంతాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. స్థానిక వ్యాపారులతో పాటు ప్రముఖ సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించుకునేలా వాణిజ్య సముదాయాలు, దుకాణాల ఏర్పాటుకు అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి ఉన్న వ్యాపారులు షాపులు, వ్యాపార సముదాయాల కేటాయింపుల కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని సంస్థ వెల్లడించింది. హైటెక్ బస్ స్టేషన్లుగా ఎంపికైన 13 ప్రాంతాలు

 నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్‌నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు,  కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర,నల్గొండ, కొత్తగూడెం మరో 86 బస్టాండ్లు మోడల్ స్టేషన్లుగా అభివృద్ధి హైటెక్ టెర్మినళ్ల నిర్మాణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఐదు వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే 86 రద్దీ బస్ స్టేషన్లను కూడా ఆర్టీసీ గుర్తించింది. వీటిని ఆధునిక సదుపాయాలతో మోడల్ బస్ స్టేషన్లుగా తీర్చిదిద్దనున్నారు. ప్రయాణికులకు బస్సుల రాకపోకల వివరాలు సులభంగా అందించడంతో పాటు స్టేషన్లలో పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. ప్రత్యేక కంట్రోలర్లు, విచారణ కేంద్రాలు ఎంపిక చేసిన మోడల్ బస్టాండ్లలో ప్రతి విభాగానికి ప్రత్యేక స్టేషన్ కంట్రోలర్‌ను నియమించనున్నారు. ప్రయాణికుల సందేహాలను నివృత్తి చేసేందుకు విచారణ కేంద్రాలు, సంప్రదింపు నంబర్లను అందుబాటులో ఉంచనున్నారు. బస్సుల రాకపోకల వేళలను ముందుగానే తెలుసుకునేందుకు స్పష్టమైన సమయ పట్టికల బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. టీజీఎస్ ఆర్టీసీ చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయితే రాష్ట్రంలోని బస్ స్టేషన్ల రూపురేఖలు మారడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందనున్నాయి. ముఖ్యంగా మధిర, కొత్తగూడెం ప్రాంతాల్లో హైటెక్ బస్ టెర్మినళ్ల ఏర్పాటుతో స్థానిక ప్రజలకు ఆధునిక రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.