BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 07:19 pm
Posted by : K MAHESH

ఉద్యాన పంటలను బిందు సేద్యంతో సాగు చేసి ఆర్థిక అభివృద్ధి సాధించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 07:19 PM
13 వీక్షణలు

రైతులకు సూచించిన జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగ మరియాన్న

నెల్లికుదురు, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా ఉద్యానవన పంటలను బిందు సేద్యం ద్వారా సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధి శాఖ అధికారి జినుగ మరియాన్న సూచించారు.

శుక్రవారం నెల్లికుదురు మండలం మునిగలవీడులో కూరగాయలు సాగు చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పంటల సాగు, యాజమాన్య పద్ధతులను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాల ద్వారా పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి మండలంలో వివిధ రకాల పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కూరగాయలు, ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, పూల తోటలు, మల్బరీ, చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలతో పాటు ఔషధ, సుగంధ తైల పంటలు, కొబ్బరి, కోకో, అవకాడో వంటి పంటలను సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. రైతుల అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో బోర్లు, బావుల కింద సాగు చేసే భూముల్లో 50 ఎకరాల విస్తీర్ణంలో ఆదాయం అందించే పంటలను సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయాలని సూచించారు. పంట మార్పిడిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు.

యాసంగి సీజన్‌లో వరికి బదులుగా కూరగాయలు, మల్బరీ తదితర ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఇందుకోసం సమీపంలోని ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి బిందు సేద్యం, మల్చింగ్ వంటి పథకాల కింద లభించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అధికారి నర్మద, రైతులు కెనాగేశ్వరరావు, సంపత్ రెడ్డి, సీతారాములు, హరిసింగ్, నాగన్న తదితరులు పాల్గొన్నారు.