BREAKING
thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● మునగపాకలో మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగ పోటీలు ప్రారంభం thumb ● ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం
Date of Publish : 01 October 2026, 06:56 am
Posted by : MOOLA RAJENDRA REDDY

ఎంపీ హామీతో నిరాహార దీక్ష విరమణ

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
Moola Rajendra Reddy Allagadda Mandal
01 Oct, 2026 - 06:56 AM
6 వీక్షణలు

నంద్యాల: నూనెపల్లె రైల్వే అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కృషి చేసి సమస్యను పరిష్కరిస్తామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు. ఎంపీ హామీతో నూనెపల్లె అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షను విరమించినట్లు కమిటీ సభ్యులు ప్రకటించారు.

ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. నూనెపల్లె అభివృద్ధి కమిటీ వినతిపత్రం అందజేసిన వెంటనే సమస్యపై స్పందించానని తెలిపారు. ఈ అంశంపై కేంద్ర రైల్వే మంత్రితో, ముఖ్యమంత్రితో చర్చించినట్లు చెప్పారు. రైల్వే డివిజనల్ మేనేజర్‌కు లేఖ పంపించామని, సంబంధిత అధికారులు నష్టపరిహారం అంచనాలను రూపొందిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ విషయంపై కలెక్టర్‌తో సమావేశం నిర్వహించి, సంబంధిత ఫైలును ముఖ్యమంత్రికి పంపించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫరూక్‌తో కలిసి ముఖ్యమంత్రిని కలసి రైల్వే అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని బైరెడ్డి శబరి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నిరాహార దీక్షను విరమించాలని కమిటీ సభ్యులను కోరారు.

ఎంపీ హామీపై నూనెపల్లె అభివృద్ధి కమిటీ సభ్యులు నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బైరెడ్డి శబరి దీక్ష చేస్తున్న వారికి స్వయంగా నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు.

కార్యక్రమంలో నూనెపల్లె అభివృద్ధి కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, మేధావులు, వ్యాపారులు, రైతులు, పశుపోషణపై ఆధారపడుతున్న మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.