BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 18 November 2026, 05:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కలగర గ్రామ రూపురేఖలు మారుస్తా.. ఒక్క అవకాశం ఇవ్వండి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 05:16 AM
13 వీక్షణలు

నామినేషన్‌కు ముందే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న జనసేన ఆశావహ సర్పంచ్ అభ్యర్థి సుమంత్

 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం: కలగర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. జనసేన పార్టీ తరఫున ఆశావహ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న సుమంత్ నామినేషన్ దాఖలు చేయకముందే ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుస్తూ తనకు ఒక్క అవకాశం కల్పిస్తే కలగర గ్రామ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. గతంలో పలువురు సర్పంచులుగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ గ్రామం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని సుమంత్ పేర్కొంటున్నారు. ఈసారి గ్రామ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని వివరిస్తున్నారు. మార్పు కోసం తనకు ఒక్క అవకాశం కల్పించాలని, కలగర గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేసేందుకు ఆశీర్వదించి గెలిపించాలని సుమంత్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నామినేషన్ దాఖలు చేయకముందే ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.