ఇంధనం మంటలపై వైసీపీ సమరభేరి
చంద్రబాబు మార్కు పాలనపై ‘వైసీపీ’ యుద్ధం..
ఆటో కార్మికుల పొట్ట గొడుతున్న కూటమి సర్కార్..
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పశ్చిమ తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన
పశ్చిమ ఎమ్మార్వో కి వినతిపత్రం సమర్పించిన మాజీ మంత్రి వెలంపల్లి
‘కార్లు వాడకండి.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి’ అనడమేనా చంద్రబాబు నీతి? - వెలంపల్లి
నేరాలు.. పెట్రోల్ ధరల్లో ఏపీ నెంబర్ వన్! - వెలంపల్లి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై, రైతాంగంపై మరియు రవాణా రంగంపై మోపిన అదనపు భారానికి నిరసనగా, సోమవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్, మాజీ మంత్రివర్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యాధరపురం పశ్చిమ తాసిల్దార్ (MRO) కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కి వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు, మరియు ప్రజలు పాల్గొని కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి నాయకుల ద్వంద్వ నీతిని, అబద్ధపు వాగ్దానాలను తీవ్రస్థాయిలో కడిగిపారేశారు. ఎన్నికల ముందు నారా లోకేష్ పాదయాత్రలో పెట్రోల్ బంక్ చూపెట్టి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ. 28 టాక్స్ వసూలు చేస్తోందని హేళన చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే టాక్స్ సగం తగ్గిస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా.. మాట నిలబెట్టుకోకపోగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధరను రూ. 113.62 కు, డీజిల్ ధరను రూ. 101.24 కు పెంచి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారన్నారు.
దేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందంటే.. ఒకటి నేరాలు, ఘోరాలు, అగాయిత్యాలలో, రెండు పెట్రోల్, డీజిల్ రేట్లలో అని ఎద్దవా చేసారు! ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 97.77, డీజిల్ రూ. 90.67 ఉంటే.. మన రాష్ట్రంలో పెట్రోల్ రూ. 113 పైచిలుకు, డీజిల్ రూ. 101 దాటించి విపరీతంగా దోచుకుంటున్నారన్నారు.
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, రవాణా ఖర్చులు పెరిగి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని.. ఈ ఇంధన ధరల పెంపు వారిని మరింత కుంగదీస్తోందని MRO కి ఇచ్చిన వినతిపత్రంలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం, కూటమి నాయకులు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని మేనిఫెస్టోలో ప్రత్యేకంగా హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలను పెంచడం ప్రజా వ్యతిరేక చర్య, ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసారన్నారు.
ఈ ధరల పెంపు ప్రభావం సమాజంలోని ప్రతి వర్గంపై పడుతోందని, ముఖ్యంగా రైతులకు వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరుగుతుందన్నారు. ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటదన్నారు. బస్సు ఛార్జీలు, రవాణా వ్యయాలు పెరిగి నిత్యావసరాల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులు అదుపు తప్పుతున్నాయన్నారు. సామాన్య ప్రజల జీవనం మరింత కష్టసాధ్యంగా మారుతోందన్నారు.
మేనిఫెస్టోలో పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తామని అబద్ధాలు చెప్పారన్నారు. మద్యం ధరలను నియంత్రిస్తామని చెప్పి, ఈరోజు బెల్ట్ షాపుల ద్వారా ఇళ్ల పక్కనే మద్యం దొరికేలా చూస్తున్నారన్నారు. చంద్రబాబు మో ప్రజలకు నీతి కబుర్లు చెబుతూ ‘కార్లు వాడకండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి’ అని సలహాలిస్తున్నారని, కానీ వాళ్ళు మాత్రం స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ ప్రజల సొమ్మును విపరీతంగా వృధా చేస్తున్నారన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే పెన్షన్ల పంపిణీ లాంటి నిరంతర ప్రక్రియకు కూడా కోట్ల రూపాయల ప్రచార ఖర్చు పెడుతున్నారన్నారు. వాహనదారుల పై భారీ చలానాలు వేసి డబ్బులు వసూలు చేయడం.. ఇదేనా చంద్రబాబు మార్కు సంపద సృష్టి అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని, హోం మంత్రి అనిత గారు, లా అండ్ ఆర్డర్ పైన దృష్టి పెట్టాలని, మీ పరిపాలన ఎంత చండాలంగా ఉందో ఆలోచించుకోవాలన్నారు.
పెంచిన ఈ రేట్ల ద్వారా రాష్ట్ర ప్రజలపై ప్రతి సంవత్సరం ఏకంగా రూ. 3,391 కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు. రోజుకు పెట్రోల్ మీద రూ. 3.29 కోట్లు, డీజిల్ మీద రూ. 6 కోట్లు.. అంటే సుమారుగా రోజుకు రూ. 10 కోట్ల రూపాయలను పేద ప్రజల జേబులు నుండి ఈ కూటమి ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. మంత్రులు కేవలం ఒక్కరోజు మీడియా వీడియోల కోసం సైకిల్ తొక్కి నిరసన నాటకాలు ఆడుతున్నారన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రతి మంత్రికి ఒక స్పెషల్ ఫ్లైట్ సిద్ధంగా ఉంటుందని, ప్రజల సొమ్ముకు అకౌంటబిలిటీ ఉన్న ఒక్క మంత్రి కూడా ఈ క్యాబినెట్‌లో లేరన్నారు.
పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని, ఇంధనాలపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అదనపు పన్నులను పునఃసమీక్షించి, ఆ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించే చర్యలు చేపడుతూనే.. రైతులు, ఆటో కార్మికులు, రవాణా రంగ కార్మికులకు ప్రత్యేక ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేసారు.
ఎన్నికల ముందు, పాదయాత్ర చేసేముందు అబద్ధాలు చెప్పుకుంటూ ఓట్లు అడిగారని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేదంటే గనుక ఆరోజు మేము చెప్పింది అబద్ధం, మేము తప్పు చేశామని చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలను వెనక్కి తీసుకోని పక్షంలో, ప్రజల తరఫున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత విస్తృత స్థాయిలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఇంధన ధరలు తగ్గించేంత వరకు ఆటో కార్మికులకు, రవాణా రంగానికి, ప్రతి సామాన్యుడికి తోడుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఎండి రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ చైర్మన్లు షేక్ అసిఫ్, బండి పుణ్యశీల, కర్నాటి రాంబాబు, మనోజ్ కొఠారి, తోలేటి శ్రీకాంత్, గౌస్ మొహిద్దీన్, మాజీ కార్పొరేటర్లు మండెపూడి ఛటర్జీ, యరడ్ల ఆంజనేయరెడ్ట్, ఇర్ఫాన్, శిరంశెట్టి పూర్ణచంద్రరావు, యలకల చలపతిరావు, తాంగెళ్ల రామచంద్రరావు, టెలిఫోన్ అడ్వైజరి మెంబర్ తనబుద్ది శేఖర్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, క్లస్టర్ మరియు డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు