BREAKING
thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు thumb ● విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణకు జనసేన నాయకుల అభినందనలు thumb ● ఫ్రాంక్‌ఫిన్ ఏవియేషన్ సంస్థపై చర్యలు తీసుకోవాలి thumb ● కోతులనడుమ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి thumb ● రాచకొండ వారి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి thumb ● కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్లు thumb ● ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు పనులు ప్రారంభం thumb ● ఉపాధి పనుల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానం thumb ● ఫోరెన్సిక్ నిర్వహణలో తెలంగాణ పనితీరు ప్రశంసనీయం thumb ● మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
Test 4
Date of Publish : 04 November 2026, 05:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మురుసు తుఫాను ప్రభావం.. వరి రైతులకు చాట్రాయి వ్యవసాయ శాఖ కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Nov, 2026 - 05:21 PM
19 వీక్షణలు

 పంటను కాపాడుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి.. రెండు రోజుల పాటు కోతలు వాయిదా వేసుకోవాలి మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ 

ఏలూరు జిల్లా, చాట్రాయి, నవంబర్ 4: మురుసు తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరి రైతులు అప్రమత్తంగా ఉండాలని చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. అధిక వర్షాల కారణంగా వరి పంట దెబ్బతినకుండా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపేలా నీటి, మురుగు కాలువలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పొలాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే వర్షాల ధాటికి నేలకొరిగిన వరి పంటలో కంకులపై ఉన్న ధాన్యం మొలకెత్తకుండా, గింజల రంగు మారకుండా నివారించేందుకు లీటరు నీటికి 50 గ్రాముల కల్లు ఉప్పు కలిపి ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని తయారు చేసి పంటపై పిచికారీ చేయాలని సూచించారు. ఈ చర్యలతో నేలకొరిగిన పంటలో ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని వివరించారు. అలాగే వరి గింజల రంగు మారకుండా, పొడ తెగులు, మాని పండు తెగులు ఆశించకుండా నివారణ చర్యలు చేపట్టాలని బి. శివశంకర్ తెలిపారు. ఇందుకోసం ఎకరానికి ప్రోపికోనజోల్ 25 శాతం ఈసీ మందు 200 మిల్లీలీటర్లు లేదా హేక్సకోనజోల్ 5 శాతం ఎస్సీ మందు 400 మిల్లీలీటర్లను తగిన నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ సూచించిన మోతాదులను పాటిస్తూ పంటను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలస్యంగా నాట్లు వేసిన ప్రాంతాల్లో వర్షపు నీరు తగ్గిన వెంటనే పైపాటుగా ఎకరానికి 20 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్ ఎరువులను చల్లుకోవాలని తెలిపారు. దీనివల్ల పంట ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రానున్న రెండు రోజులు కూడా వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని వరి కోతలను తాత్కాలికంగా నిలిపివేయడం మంచిదని బి. శివశంకర్ సూచించారు. వర్షాలు తగ్గి వాతావరణం అనుకూలించిన తర్వాతే కోతలు చేపట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తుఫాను పరిస్థితుల్లో తొందరపడి కోతలు చేపట్టి పంటను నష్టపోవద్దని, వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ ధాన్యం నాణ్యతను కాపాడుకోవాలని చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ కోరారు

.