BREAKING
thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం
Date of Publish : 13 October 2026, 04:11 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భారత్‌ జీడీపీ వృద్ధి అంచనా 7 శాతానికి పెంపు.. ఐఎంఎఫ్ ప్రకటన

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
13 Oct, 2026 - 04:11 PM
3 వీక్షణలు

న్యూఢిల్లీ: ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ తన స్థానాన్ని కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వెల్లడించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను గతంలో 6.4 శాతంగా పేర్కొనగా, తాజాగా 7 శాతానికి పెంచింది. 2027–28 ఆర్థిక సంవత్సరానికి కూడా వృద్ధి అంచనాను 7 శాతానికి సవరించింది.

భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పుంజుకోవడానికి బలమైన దేశీయ డిమాండ్‌, సేవల రంగంలో కొనసాగుతున్న కార్యకలాపాలు ప్రధాన కారణాలని ఐఎంఎఫ్‌ పేర్కొంది. దేశీయ మార్కెట్‌ విస్తరణ, అనుకూల జనాభా పరిస్థితులు, నిర్మాణాత్మక సంస్కరణలు కూడా వృద్ధికి తోడ్పడుతున్నాయని తెలిపింది.

ఇదిలా ఉండగా, భారత రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా 2026–27 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 7.1 శాతానికి పెంచింది. ఐఎంఎఫ్‌, ఆర్‌బీఐ అంచనాలు దేశ ఆర్థిక వృద్ధిపై ఆశావహ దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు భవిష్యత్తులో వృద్ధిపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.