BREAKING
thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● పెదకూరపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో హుండీ లెక్కలపై ప్రశ్నలు thumb ● తెలంగాణ రక్షణ సేనలో చేరిన గజ్జెల శివ thumb ● ఒడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు
Date of Publish : 01 October 2026, 06:35 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్ అండర్ బ్రిడ్జి వద్ద వినూత్న నిరసన

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
01 Oct, 2026 - 06:35 PM
10 వీక్షణలు

పైప్‌లైన్ లీకేజీ, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

వరంగల్, అక్టోబర్ 1: వరంగల్ అండర్ బ్రిడ్జి కింద నెలకొన్న మంచినీటి పైప్‌లైన్ లీకేజీ, డ్రైనేజీ నీరు, చేపలు కడిగిన నీటితో ఏర్పడుతున్న బురద, దుర్వాసన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు.

అండర్ బ్రిడ్జి పరిసరాల్లో నెలలుగా మంచినీటి పైప్‌లైన్ లీకేజీ కొనసాగుతున్నప్పటికీ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని మేరుగు అశోక్ ఆరోపించారు. పైప్‌లైన్ లీకేజీతో పాటు డ్రైనేజీ నీరు, చేపలు కడిగిన నీరు రోడ్డుపై చేరడంతో బురద, దుర్వాసన ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ సమస్యపై అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు అండర్ బ్రిడ్జి వద్ద గులాబీ పూలు చల్లి వినూత్న రీతిలో నిరసన చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మంచినీటి పైప్‌లైన్ లీకేజీ, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.