BREAKING
thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● ఆమడగూరు మండలంలో రూ.13.52 కోట్లతో 57 అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● పల్లె పండుగ–3.O తో పల్లెల్లో రహదారుల అభివృద్ధి thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● దసరా సందర్భంగా బోనస్ ఇవ్వాలని కోరుతూ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా thumb ● పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి సమీక్ష thumb ● ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక
Date of Publish : 06 October 2026, 06:48 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భద్రకాళి దేవస్థానంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
06 Oct, 2026 - 06:48 PM
8 వీక్షణలు

శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ఠ భద్రతా చర్యలు

వరంగల్: వరంగల్ నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పోలీస్ శాఖ చేపడుతున్న ముందస్తు భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలు, భక్తుల క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలు, భద్రతా విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అడిషనల్ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) రాయల ప్రభాకర్ రావు, హన్మకొండ ఏసీపీ నర్సింహారావు, ట్రాఫిక్ ఏసీపీ టి. సత్యనారాయణ, మట్టెవాడ, ఇంతేజర్‌గంజ్, మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్లు, ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.