BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 06:47 pm
Posted by : K MAHESH

ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్ నిధులతో తండాల్లో సోలార్ లైట్ల ఏర్పాటు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 06:47 PM
14 వీక్షణలు

తండాల్లో వెలుగులు నింపిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ కృషి.. కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు

నెల్లికుదురు, నవంబర్ 11:

మండలంలోని పలు తండాల్లో రాత్రివేళ చీకటి సమస్యను పరిష్కరించేందుకు ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్ నిధులతో సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ చొరవతో రత్తిరాం తండా, నల్లగుట్ట తండా, మేచరాజుపల్లి, పెద్ద తండాల్లో ఈ లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో రాత్రివేళ విద్యుత్ వెలుగులు అందుబాటులోకి వచ్చాయి.

ఈ సందర్భంగా సోలార్ లైట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ మదన్ లాల్ నాయక్ మాట్లాడుతూ.. తండాల అభివృద్ధి కోసం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ చేసిన కృషి ఫలితంగానే నాలుగు గ్రామాలకు సోలార్ లైట్లు మంజూరయ్యాయని తెలిపారు.

జాతీయ ఎస్టీ కమిషన్ ద్వారా ఎన్‌టీపీసీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, తండాల్లో రాత్రివేళ నెలకొంటున్న చీకటి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి సీఎస్‌ఆర్ నిధులు సమకూర్చేందుకు హుస్సేన్ నాయక్ కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన చొరవతో నాలుగు గ్రామాల్లో సోలార్ లైట్ల ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు.

తండాల్లో సరైన వెలుతురు లేక రాత్రి సమయంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గనున్నాయని అన్నారు. చాలా కాలంగా తండా ప్రజలు ఎదురుచూస్తున్న సోలార్ లైట్ల ఏర్పాటు పూర్తికావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

తండాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేసిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు గ్రామస్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష్, రత్తిరాం, కిస్నా, రమేష్, మంగు, సోమన్న, పర్సు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.