BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 06:54 pm
Posted by : KOPURI LAKSHMAN

వీర్లపాడు పంచాయతీ ఎన్నికలో ఆసక్తికర రాజకీయ సమీకరణాలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
15 Nov, 2026 - 06:54 PM
116 వీక్షణలు

సీపీఐ అభ్యర్థి వట్టికొండ రమ్యకృష్ణకు టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతు

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ / నవంబర్ 15 / ఎన్ టుడే న్యూస్:

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని వీర్లపాడు మండల కేంద్రం గ్రామపంచాయతీ ఎన్నిక రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు ఉండగా, వీర్లపాడు గ్రామంలో మాత్రం భిన్నమైన రాజకీయ సమీకరణం కనిపిస్తోంది. ఇక్కడ సీపీఐ తరఫున పోటీ చేస్తున్న వట్టికొండ రమ్యకృష్ణకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

వీర్లపాడు గ్రామానికి గత నాలుగు దశాబ్దాలుగా సీపీఐ, వట్టికొండ కుటుంబానికి రాజకీయంగా అనుబంధం కొనసాగుతోందని స్థానికంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో తమకు ఉన్న రాజకీయ సంబంధాన్ని కొనసాగిస్తూ వట్టికొండ కుటుంబం నుంచి ఈసారి బీటెక్ విద్యార్హత కలిగిన రమ్యకృష్ణను అభ్యర్థిగా బరిలోకి దించారు.

రాష్ట్ర స్థాయిలో ఏర్పడిన రాజకీయ పొత్తులకు భిన్నంగా స్థానిక పరిస్థితులు, గ్రామంలోని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సీపీఐ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వీర్లపాడు గ్రామపంచాయతీ ఎన్నికపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

వట్టికొండ కుటుంబానికి గ్రామంలో ఉన్న దీర్ఘకాలిక రాజకీయ అనుబంధం, వివిధ పార్టీల మద్దతుతో ఈసారి ఎన్నికల పోటీ ప్రత్యేకతను సంతరించుకుంది. ఎన్నికల ప్రచారం, ఓటర్ల స్పందన, ఇతర అభ్యర్థుల పోటీ తదితర అంశాలు గ్రామపంచాయతీ ఎన్నికలపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.