కనిగిరి 21వ వార్డులో వైఎస్సార్‌సీపీ నేతల ఆత్మీయ సమావేశం
కనిగిరి: పట్టణంలోని 21వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య నాయకుడు బాదం సత్యం నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆత్మీయ మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.
ఈ సమావేశంలో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడం, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
స్థానిక ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావచ్చని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వార్డులో పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు చర్చించారు.
ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్, చింతగుంట్ల సాల్మన్ రాజు, సూరసాని మోహన్ రెడ్డి, కటికల వెంకటరత్నం, రాచపూడి మాణిక్యరావు, సిరుప గోవర్ధన్ రెడ్డి, తమ్మనేని సుజాత, చింతం శ్రీనివాసులు, బచ్చు వెంగళరావు గుప్తా, రాచర్ల నరేష్ గుప్తా, పులి శ్రీను, చీమలదిన్నె వెంగయ్య, అయిమళ్ళ నాగమణి, యర్రబల్లి దేవరాజ్, షేక్ ఖాజా మొహిద్దిన్, దర్శి ఫణి కుమార్, పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, షేక్ పోలిచర్ల రహీం భాష, షేక్ నాగూర్ వలి, చింతగుంట్ల కిషోర్ బాబు, పలుకూరి భాస్కర్, షేక్ కరిముల్లా, షేక్ రెహమాన్, సైకం ఏడుకొండలు రెడ్డి, ఆవుల తిరుపతిరెడ్డి, షేక్ షకీలా, ఇండ్ల భాను, మద్దిశెట్టి భారతి, పాలువాది జగదీష్, పాలువాది జయ రామచంద్ర, గోంట్ల చరణ్, కొత్త ఫణి, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.