BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 03:35 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. యువతికి రూ.10.05 లక్షల టోకరా

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Nov, 2026 - 03:35 PM
22 వీక్షణలు

నెల్లూరు వాసినంటూ నమ్మించి నగలు, క్రెడిట్ కార్డు స్వాహా సోషల్ మీడియా పరిచయాలను ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు యువతిని భారీగా మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని నమ్మించి ఏకంగా రూ.10.05 లక్షల మేర నగలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను కాజేసి నిందితుడు ఉడాయించాడు. వివరాల్లోకి వెళితే.. నానక్‌రామ్‌గూడాలో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తనది నెల్లూరు అని, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సొంత ఇల్లు ఉందని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. కొంతకాలం నమ్మకంగా మాట్లాడుతూ ఆమె విశ్వాసాన్ని పొందాడు. ఈ క్రమంలో తన చెల్లెలి వివాహం ఉందని, ఆదాయపు పన్ను శాఖ అధికారులు తన బ్యాంకు ఖాతాను స్తంభింపజేశారని, నగలు కొనుగోలు చేసేందుకు డబ్బులు అందుబాటులో లేవని నమ్మబలికాడు. తన వద్ద నగలు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేవని, పెళ్లి పూర్తయిన వెంటనే తిరిగి ఇచ్చేస్తానని చెప్పి యువతి వద్ద ఉన్న నగలను అడిగాడు. అతడి మాటలు నమ్మిన యువతి ర్యాపిడో ద్వారా నగలను అతడికి పంపించింది. అంతటితో ఆగని నిందితుడు.. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని, అత్యవసరంగా క్రెడిట్ కార్డు అవసరమని మరో కథ అల్లాడు. అతడి మాటలకు మరోసారి మోసపోయిన యువతి ర్యాపిడో ద్వారా తన క్రెడిట్ కార్డును కూడా పంపించింది. ఆ తర్వాత నిందితుడు అందుబాటులో లేకుండా పోవడంతో పాటు ఆచూకీ లేకుండా మాయమయ్యాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నగలు, ఇతర ఆర్థిక నష్టాలు కలిపి మొత్తం రూ.10.05 లక్షలు కోల్పోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై పోలీసులు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.