BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
Date of Publish : 09 October 2026, 01:16 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

యోగి ఆదిత్యనాథ్‌కు విజయవాడ దసరా ఉత్సవాలకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
09 Oct, 2026 - 01:16 PM
1 వీక్షణలు

విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు.

విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. నగర సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో యోగి ఆదిత్యనాథ్ పాల్గొనాలని మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ఆయన పర్యటన ద్వారా ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.

విజయవాడలో జరిగే దసరా వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నగర ఆధ్యాత్మిక వారసత్వాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆహ్వానం అందించినట్లు సమాచారం.