BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 04:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జార్జిపేటలో కూటమి సర్పంచ్ అభ్యర్థి తాళ్లూరి సౌమ్య రెడ్డి ఇంటింటి ప్రచారం మహిళల ఘన స్వాగతం..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 04:12 PM
19 వీక్షణలు

గ్రామ సమస్యల పరిష్కారానికి హామీ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ పరిధిలోని జార్జిపేట గ్రామంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాళ్లూరి సౌమ్య రెడ్డి, వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న డోలా డేవిడ్ రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ తమకు మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న సర్పంచ్ అభ్యర్థి తాళ్లూరి సౌమ్య రెడ్డికి మహిళలు పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. ప్రచార సమయంలో గ్రామంలోని డ్రైనేజీ, రహదారులతో పాటు ఇతర సమస్యలను మహిళలు, గ్రామస్థులు అభ్యర్థి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సౌమ్య రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొంటూ ప్రజల ఆశీర్వాదం, మద్దతు కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తాళ్లూరి సౌమ్య రెడ్డి బుట్ట గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న డోలా డేవిడ్ రాజుకు కుక్కర్ గుర్తుపై ఓటు వేసి విజయం చేకూర్చాలని గ్రామస్థులను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జార్జిపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.