BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 04:46 pm
Posted by : MUSUGU GOPI

'సెల్ఫీ' నేతలపై జగన్ అసంతృప్తి? 60–70 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జుల మార్పుపై ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
17 Nov, 2026 - 04:46 PM
15 వీక్షణలు

స్థానిక ఎన్నికల్లో పనితీరుపై సమీక్ష.. కేడర్‌కు అండగా నిలవని నేతలపై చర్యలకు యోచన?

ఆంధ్రప్రదేశ్ | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతల పనితీరుపై దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆయన.. గెలుపోటములతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో నేతలు వ్యవహరించిన తీరును సమీక్షిస్తున్నట్లు సమాచారం.

అధికార పార్టీ నుంచి సవాళ్లు ఎదురైనప్పటికీ పార్టీ శ్రేణులకు అండగా నిలిచిన నేతలు ఎవరు? ఇబ్బందులు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గినవారు ఎవరు? అనే వివరాలను జగన్ సేకరిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ కార్యకర్తల దౌర్జన్యాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయామని ఫిర్యాదులు అందగా, మరికొన్ని చోట్ల అలాంటి పరిస్థితులు లేకున్నా స్థానిక నేతలు రాజీ ధోరణితో వ్యవహరించారని ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. పలువురు నేతలు పార్టీ శ్రేణులకు అండగా నిలిచి పనిచేసినప్పటికీ, సుమారు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో బాధ్యతలు చూస్తున్న కొందరు నేతలు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించలేదనే ఫిర్యాదులు అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సీనియర్ నేతలు తగిన సహకారం అందించలేదని కొందరు పార్టీ నాయకులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ ఫిర్యాదులపై పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా వివరాలు సేకరించి, బాధ్యులుగా భావిస్తున్న నేతలతో మాట్లాడాలని జగన్ నిర్ణయించినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత నేతలను పిలిచి వివరణ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. పనితీరుపై వచ్చిన ఫిర్యాదులు నిజమని తేలితే కొందరిని నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించి, కొత్తవారికి అవకాశం కల్పించవచ్చనే ప్రచారం వినిపిస్తోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఇప్పటి నుంచే పార్టీ నాయకత్వాన్ని, నియోజకవర్గాల బాధ్యతలను పునర్వ్యవస్థీకరించాలని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చిన వైసీపీకి ఆ నిర్ణయం రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపిందనే అంశంపై కూడా పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

కొన్ని నియోజకవర్గాల్లో స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులకు బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో వైసీపీలో సంస్థాగత మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే 60–70 మంది ఇన్‌చార్జుల మార్పు, నేతలపై చర్యలు వంటి అంశాలపై వైసీపీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.