BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జలంధర్‌లో సెప్టెంబర్ 20, 21 తేదీల్లో అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ మహాసభలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jul, 2026 - 11:06 AM
123 వీక్షణలు

అఖిల భారత కిసాన్ మహాసభ (ఏఐకేఎం) జాతీయ మహాసభలు 2026 సెప్టెంబర్ 20, 21 తేదీల్లో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ జాతీయ కార్యదర్శి డి. హరినాథ్ తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జుంఝనూలో జరిగిన జాతీయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఢిల్లీ నుంచి చరవాణి ద్వారా వెల్లడించారు.

స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జన్మించిన పంజాబ్ గడ్డపై జరగనున్న ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాల వల్ల భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, ఈ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వేలాది ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాన్ని వ్యతిరేకిస్తూ అన్ని రైతు సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఇటీవల యూరియా సరఫరాపై తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేసి రైతులకు ఒకేసారి అవసరమైన యూరియాను అందించాలని డిమాండ్ చేశారు.

స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులకు సి2+50 శాతం గిట్టుబాటు ధర కల్పించాలని, కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసే ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతాంగానికి కూడా రుణమాఫీ ప్రకటించాలని కోరారు.

అలాగే 60 సంవత్సరాలు దాటిన ప్రతి రైతుకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని, సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

అటవీ భూములను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించిన హరినాథ్, "వ్యవసాయాన్ని, భూమిని, రైతును కాపాడుకుందాం" అంటూ పిలుపునిచ్చారు.