BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 14 October 2026, 03:31 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మున్సిపల్ పదవుల్లో 40.1 శాతం వాటా కోరిన జనసేన.. 2,091 స్థానాల ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Oct, 2026 - 03:31 PM
13 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కూటమి పొత్తులో భాగంగా తమకు 40.1 శాతం వాటా కేటాయించాలని జనసేన ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు మొత్తం 2,091 పదవులతో కూడిన ప్రతిపాదన జాబితాను జనసేన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రతిపాదనలో భాగంగా 6 మేయర్ స్థానాలు, 6 డిప్యూటీ మేయర్ పదవులు, 38 మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానాలు, 41 వైస్ చైర్‌పర్సన్ పదవులు ఇవ్వాలని జనసేన కోరినట్లు సమాచారం. అలాగే నగర పంచాయతీల్లో 6 చైర్‌పర్సన్, 6 వైస్ చైర్‌పర్సన్ స్థానాలను తమకు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

అయితే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, పదవుల పంపకాలపై చర్చలు పూర్తికాకముందే జనసేన ప్రతిపాదన జాబితా విడుదల కావడంపై టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే జాబితా ఎలా విడుదల చేస్తారని పలువురు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య పదవుల పంపకం అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.