BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 14 October 2026, 08:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ రేసుపై ఆసక్తి!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Oct, 2026 - 08:32 PM
11 వీక్షణలు

పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్న వంగవీటి.. స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చలు

మంగళగిరి: రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. రాధాకృష్ణతో పాటు తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ కూడా జనసేనలో చేరారు.

వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరికతో విజయవాడ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిత్వంపై ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు తిరుపతి మేయర్ రేసులో ప్రణీత్ ప్రమోద్ పేరు కూడా వినిపిస్తోంది.

విజయవాడ నగర రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు నేపథ్యంలో ఆయన చేరికపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. జనసేన బలోపేతానికి ఈ చేరికలు ఎంతవరకు ఉపయోగపడతాయన్న అంశంపై చర్చ జరుగుతోంది.

స్థానిక ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ జనసేనలోకి ప్రముఖ నేతల చేరికలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. అయితే మేయర్ అభ్యర్థులపై తుది నిర్ణయం పార్టీ అధిష్టానం ప్రకటించాల్సి ఉంది.