BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 04:18 am
Posted by : K MAHESH

రామన్నపేటలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 04:18 AM
30 వీక్షణలు

నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు.. జీపీఎస్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ

యాదాద్రి జిల్లా, రామన్నపేట: భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు, భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను రామన్నపేటలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరోద్ధిన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నెహ్రూ సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా రామన్నపేట పాత బస్టాండ్ ఆవరణలో ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జీపీఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జవహర్‌లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, శాస్త్రీయ దృక్పథం, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ నిర్మాణానికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు.

పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, చిన్నారులపై ఆయనకున్న ప్రేమకు గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 14న ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మిన నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతాయని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి చదువుపై ఆసక్తి పెంచుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కొత్తపల్లి అబ్రహం కుమార్, ఉప సర్పంచ్ మోడీ రమేష్, కాంగ్రెస్ నాయకులు బొడ్డు సాలయ్య, గోదాసు గ్రీలు, మీర్జా బషీర్, మొహమ్మద్ నాసర్, మొహమ్మద్ బషీర్ దౌల, మొహమ్మద్ అన్వర్, కొరిగే శేఖర్, మొహమ్మద్ అంజాద్, నగర కంటి సుదర్శన్, మీర్జా నజీర్ బేగ్, మహమ్మద్ రిజ్వాన్, లవరం సాయి, ఈ నాయతుల్లా బేగ్, కక్కిరేణి రవీందర్, చంద్రారెడ్డి, సైదులు, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.