BREAKING
thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● అండర్‌పాస్ కోసం సూరారం గ్రామంలో మహాధర్నా thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం
Date of Publish : 06 October 2026, 01:17 pm
Posted by : ANTHATI NARENDAR

జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
06 Oct, 2026 - 01:17 PM
19 వీక్షణలు

ముఖ్యమంత్రికి పోస్ట్‌కార్డులు పంపిన TUWJ-H143 జర్నలిస్టులు

చిట్యాల: జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్‌ వైద్య సేవలు అందించేలా ఈజేహెచ్‌ఎస్‌ (EJHS) హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (TUWJ-H143) ఆధ్వర్యంలో చిట్యాలలో పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు.

TUWJ-H143 రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జర్నలిస్టులు ముఖ్యమంత్రికి తమ డిమాండ్లను తెలియజేస్తూ పోస్ట్‌కార్డులు రాశారు. అనంతరం వాటిని పోస్టాఫీసులోని పోస్ట్‌బాక్స్‌లో వేశారు.

ఈ సందర్భంగా TUWJ-H143 చిట్యాల మండల అధ్యక్షుడు రేగొండ వేణుమాధవ్‌ మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వార్తల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్‌లెస్‌ వైద్య సేవలు అందించేలా ఈజేహెచ్‌ఎస్‌ హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు బుస్సా శ్రీనివాస్‌, కంభంపాటి సతీష్‌, కార్యదర్శి చిర్రబోయిన మల్లేష్‌, మండల ప్రధాన కార్యదర్శి చెన్నోజు చంద్రశేఖర్‌, కోశాధికారి బోడిగె విజయ్‌కుమార్‌, కార్యదర్శి మూడ వెంకటాద్రి, టెమ్జూ నియోజకవర్గ అధ్యక్షుడు కొల్లోజు శ్రీకాంత్‌, జర్నలిస్టులు పాటి మోహన్‌రెడ్డి, జిట్ట నరేష్‌, గుండ్లపల్లి వెంకన్న, అంతటి నాగరాజు, దేశబోయిన సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు..