BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 09 October 2026, 06:50 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజా హక్కుల కోసం కే బాలగోపాల్ రాజీ లేని పోరాటం డి.హరినాధ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Oct, 2026 - 06:50 AM
2 వీక్షణలు

విస్సన్నపేటలో వర్ధంతి సభలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్

విస్సన్నపేట: ప్రజా హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం రాజీలేని పోరాటం చేసిన ఉద్యమకారుడు కే. బాలగోపాల్ అని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో నిర్వహించిన కే. బాలగోపాల్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ, బాలగోపాల్ మాటల్లో అనేక బలహీన వర్గాల హక్కులు, ఆశయాలు ప్రతిబింబించేవని పేర్కొన్నారు. మాటలతో బోధిస్తూ, ఆచరణతో ప్రజలను ఆకట్టుకున్న వ్యక్తి బాలగోపాల్ అని కొనియాడారు.

అత్యంత నిరాడంబరమైన జీవనశైలిని అనుసరిస్తూ, సాధారణ రబ్బరు చెప్పులతో ప్రజల్లో తిరుగుతూ, తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మరణించే వరకు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, పౌర హక్కుల పరిరక్షణ కోసం ఆయన పోరాడారని హరినాథ్ గుర్తుచేశారు. రాజ్య హింసకు వ్యతిరేకంగా, ప్రజల హక్కుల సాధన కోసం వివిధ వేదికలపై తన గళాన్ని వినిపించారని తెలిపారు.

ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారనే విమర్శల నేపథ్యంలో కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ కాకినాడలో నిర్వహించిన సదస్సుకు బాలగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ప్రజలకు మద్దతు తెలిపారని వివరించారు.

తూర్పుగోదావరి జిల్లాలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాలు నిర్వహిస్తున్న సమయంలో, పత్తిపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాలపై భూస్వాములు, పోలీసులు దాడులు చేస్తున్న నేపథ్యంలో బాలగోపాల్ హైదరాబాద్ నుంచి వచ్చి ఆయా గ్రామాలను సందర్శించారని హరినాథ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించుకున్నారని గుర్తుచేశారు.

విజయవాడలో నిర్వహించిన ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ జాతీయ మహాసభల్లో రాజ్య హింసకు వ్యతిరేకంగా జరిగిన సదస్సులో బాలగోపాల్ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారని పేర్కొన్నారు. పోరాటాల చరిత్ర కలిగిన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడులో జరిగిన అమరవీరుల సభల్లోనూ పలుమార్లు పాల్గొని మానవ హక్కులు, ప్రభుత్వ హింసకు సంబంధించిన అంశాలపై ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు.

అనంతపురంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నిర్వహించిన సదస్సులోనూ బాలగోపాల్ పాల్గొన్నారని హరినాథ్ వెల్లడించారు. పార్టీలకు అతీతంగా వివిధ వర్గాల ప్రజలు ఆహ్వానించిన కార్యక్రమాలకు హాజరవుతూ, విశాల దృక్పథంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజా ఉద్యమాలకు మద్దతు తెలిపేవారని అన్నారు.

సోంపేట ఉద్యమంలోనూ బాలగోపాల్ క్రియాశీలక పాత్ర పోషించారని హరినాథ్ గుర్తుచేశారు. ప్రజా హక్కుల పరిరక్షణ, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసిన బాలగోపాల్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు.

బాలగోపాల్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా హక్కుల పరిరక్షణ కోసం పోరాడటమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని హరినాథ్ అన్నారు. ఈ సందర్భంగా అమరజీవి కే. బాలగోపాల్‌కు జోహార్లు అర్పించారు.