BREAKING
thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● కళ్లేడి గ్రామంలో వికలాంగులు, వితంతువులకు పెన్షన్ల కోసం దరఖాస్తులు thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 చేయూత పెన్షన్లు మంజూరు thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 12 November 2026, 06:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయవాడలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై కేఏ పాల్ విమర్శలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Nov, 2026 - 06:34 PM
3 వీక్షణలు

అది పరివర్తన పార్టీ కాదు.. అపరివర్తన అవినీతి పార్టీ అంటూ ఎద్దేవా విజయవాడ: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి ఏర్పాటు చేసిన పార్టీ పరివర్తన పార్టీ కాదని, అపరివర్తన అవినీతి పార్టీ అని ఎద్దేవా చేశారు. దాచుకున్న నల్లధనాన్ని కాపాడుకునేందుకే ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీని స్థాపించారని ఆరోపించారు. గతంలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు కొత్త వ్యూహంతో ముందుకు వచ్చారని కేఏ పాల్ విమర్శించారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వరకు విస్తరించి ఉన్నాయని పేర్కొన్న ఆయన ఆస్తులను, అక్రమంగా సంపాదించిన సొమ్మును వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డికి సంబంధించిన ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ ఓటు బ్యాంకును దెబ్బతీయడంతో పాటు ఇతర రాజకీయ శక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకే విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా ఒకే వర్గం ఆధిపత్యం కొనసాగుతోందని కేఏ పాల్ అన్నారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు, 27 శాతం ఉన్న కాపులకు రాజ్యాధికారం ఎప్పుడు దక్కుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు

.