BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 10 May 2026, 11:32 am
Posted by : BATHULA VENKATESH

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు

తెలంగాణ
/ తెలంగాణ
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
10 May, 2026 - 11:32 AM
76 వీక్షణలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు

మైనర్ బాలిక ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభం

హైదరాబాద్ 

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరధ్పై మైనర్ బాలికకు సంబంధించిన కేసు నమోదైనట్లు సమాచారం. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఘటనలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని సమాచారం. అలాగే వేధింపులు భరించలేక తమ కుమార్తె రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా కాలేజ్ ర్యాగింగ్ ఘటనలో బండి సాయి భగీరధ్ పేరు వినిపించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఈ కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆరోపణలపై బండి సాయి భగీరధ్ లేదా కుటుంబ సభ్యుల స్పందన ఇంకా వెలువడలేదు.

పోలీసుల దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.