BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 24 June 2026, 11:09 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

రూ.2కే పసుపు నారు.. కొండా లక్ష్మణ్ బాపూజీ పరిశోధన కేంద్రం ద్వారా పంపిణీ.. ఐదు జిల్లాల రైతులకు వరం

తెలంగాణ
/ నిజామాబాద్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
24 Jun, 2026 - 11:09 AM
177 వీక్షణలు

రూ.2కే పసుపు నారు..

కొండా లక్ష్మణ్ బాపూజీ పరిశోధన కేంద్రం ద్వారా పంపిణీ..

ఐదు జిల్లాల రైతులకు వరం

నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు చేసే రైతులకు కమ్మర్పల్లి కొండా లక్ష్మణ్ బాపూజీ పసుపు పరిశోధన కేంద్రం వరంగా మారింది. కేంద్రంలో ఒక్కో మొక్క రూ.2కే ఒక్కొక్కరికి వెయ్యి నారు మొక్కలను అందిస్తున్నట్లు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విద్య తెలిపారు.

సోమవారం ఆమె పలువురు రైతులకు నారు పంపిణీ చేశారు. బయట మార్కెట్లో ఒక్కో మొక్క రూ.5 నుంచి రూ.10 వరకు ఉండగా, ఇక్కడ రూ.2కే లభిస్తోంది. దీంతో ఎకరాకు నారు ఖర్చు సుమారు రూ.2 వేలకు తగ్గిందని రైతులు చెబుతున్నారు. ఈ నర్సరీలో నెల రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో నారును పెంచి నేరుగా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు విద్య తెలిపారు. దుంపకుళ్లు, ఆకుపచ్చ తెగుళ్ల బెడద లేకుండా మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయని వివరించారు.

ఈసారి పరిశోధన కేంద్రంలో లక్షా 20 వేల నారు మొక్కలు పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే లక్ష వరకు పంపిణీ చేసినట్లు కమ్మరపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య 'వెలుగు'కు తెలిపారు. గతంలో లక్షా 12 వేల నారు మొక్కలు, 30 క్వింటాళ్ల విత్తన పసుపు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

రైతులకు అవసరమైన దుగ్గిరాల ఎరుపు, సేలం, రాజపురి, రాజేంద్ర సోనియా వంటి అధిక దిగుబడి, అధిక కర్కుమిన్ శాతం కలిగిన రకాల నారును కేంద్రంలో పెంచుతున్నారు. అలాగే మారన్ రకం అల్లం నారును కూడా పెంచి పంపిణీ చేస్తున్నారు. నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి రైతులు వచ్చి నారు తీసుకెళ్తున్నట్లు శాస్త్రవేత్త విద్య తెలిపారు.