BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 24 June 2026, 12:35 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ధర్మపురిలో ఘనంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
24 Jun, 2026 - 12:35 PM
305 వీక్షణలు

ధర్మపురిలో ఘనంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేసిన ధర్మపురి మునిసిపల్ చైర్మన్ వేముల నాగ లక్ష్మి 

​ధర్మపురి, జూన్ 24:

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు విద్యే బలమైన పునాది అని ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి అన్నారు. బుధవారం పట్టణంలోని 5వ వార్డు అంగన్వాడి పాఠశాలలో చిన్నారులకు యూనిఫాంలు, అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఆమె పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి అవసరమైన అన్ని సౌకర్యాలు మరియు నాణ్యమైన విద్యా సామగ్రిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అంగన్వాడి చిన్నారులకు యూనిఫాంలు అందించడం ద్వారా వారిలో విద్యాభ్యాసంపై ఆసక్తి పెరుగుతుందని, అదేవిధంగా విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందజేయడం వల్ల కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. చిన్నారులు క్రమశిక్షణతో చదువుకుని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.