BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 06 August 2026, 05:52 pm
Posted by : కూనురు మధు

కల్లుగీత కార్మికుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
06 Aug, 2026 - 05:52 PM
410 వీక్షణలు

కల్లుగీత కార్మికుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

  • ​గీత కార్మికుల ‘చైతన్య యాత్ర’కు ఘనంగా సంఘీభావం
  • రూ. 4,000 పింఛన్, రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికులకు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. రాష్ట్ర కల్లుగీత అధ్యక్షుల ఆధ్వర్యంలో నకిరేకల్ నియోజకవర్గం మీదుగా సాగుతున్న కల్లుగీత కార్మికుల చైతన్య యాత్ర’కు ఆయన ప్రత్యక్షంగా హాజరై పూర్తి సంఘీభావం తెలిపారు. ​ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో గీత కార్మికులకు రూ. 4,000 పింఛన్ సదుపాయం కల్పిస్తామని, ప్రమాద పరిహారం ను. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచుతామని ఇచ్చి న హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. అంతేకాకుండా, గీత కార్మికుల ఉపాధి పరిరక్షణకు, తాటి-ఈత వన సంరక్షణ, సంక్షేమం మరియు ఆధునీకరణ చేస్తామని చెప్పిన మాటలను తుంగలో తొక్కి కార్మికులను నట్టేట ముంచిందని ఆరోపించారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చే ఎక్స్-గ్రేషియాను 60 వేల నుంచి ఏకంగా రూ. 5 లక్షలకు పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అప్పట్లో ప్రమాదం జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ అయ్యేదని వివరించారు.

​రూ. 20 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ​ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్-గ్రేషియా మంజూరు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ. 20 కోట్లకు పైగా బకాయిలు నిలిపివేయడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు. ​ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 25,000 మంది గీత కార్మికులు కేవలం ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ​గీత కార్మికులకు హామీ ఇచ్చిన ప్రకారం 4,000 రూపాయల పింఛన్ అమలు చేయాలని, ​ప్రమాద పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచి, పెండింగ్‌లో ఉన్న రూ. 20 కోట్ల ఎక్స్-గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు. ​వన సంరక్షణ, ఉపాధి ఆధునీకరణ కోసం అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేయాలన్నారు ​కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చేవరకు వారికి అండగా పోరాటాలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గీత నెల చైతన్య యాత్ర సభ్యులు, నకిరేకల్ నియోజకవర్గంగా ఉన్న కళ్ళుగీత కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు...