కల్కి భగవాన్ మృతి.. వరదయ్యపాలెం ఆశ్రమానికి పార్థివ దేహం
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్: కల్కి భగవాన్ మృతి చెందినట్లు సమాచారం. చెన్నై నుంచి ఆయన పార్థివ దేహాన్ని తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలోని ఆశ్రమానికి తరలిస్తున్నారు. మూడు రోజుల పాటు భక్తులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి కడసారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
భక్తుల రాక నేపథ్యంలో వరదయ్యపాలెం ఆశ్రమం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.