BREAKING
thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● బోయకొండ దేవస్థానం ఈవో కార్యాలయంలో సీసీ కెమెరాలపై ప్రశ్నలు thumb ● ఎస్ఎంసీ నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే thumb ● వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎంపీపీ వెంకట కృష్ణారావు thumb ● ఆత్రేయపురంలో ఎస్ఎంసీ ఎన్నికల్లో ఉద్రిక్తత thumb ● అర్హత లేని ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి thumb ● సింగరేణి గుడిసెల్లో సినిమా షూటింగ్ సందడి శరవేగంగా నూతన చిత్రం చిత్రీకరణ
Date of Publish : 30 September 2026, 06:52 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

వైఎస్ జగన్‌ను కలిసిన కనిగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
30 Sep, 2026 - 06:52 PM
19 వీక్షణలు

వైఎస్ జగన్‌ను కలిసిన కనిగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్

తాడేపల్లి, సెప్టెంబర్ 30: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ కలిశారు.

ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళికలు, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ, పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్‌తో చర్చించినట్లు దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 135 గ్రామ పంచాయతీలు, 6 జెడ్పీటీసీలు, 75 ఎంపీటీసీ స్థానాలు, మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాలని చర్చించినట్లు పేర్కొన్నారు.

పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలిపి, పార్టీ విజయానికి కృషి చేయాలని వైఎస్ జగన్ సూచించినట్లు దద్దాల నారాయణ యాదవ్ వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత బలోపేతం, స్థానిక స్థాయిలో నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై కూడా చర్చ జరిగినట్లు దద్దాల నారాయణ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.