BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 07 August 2026, 06:13 pm
Posted by : కూనురు మధు

కష్టజీవుల హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే : చెరుపల్లి సీతారాములు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
07 Aug, 2026 - 06:13 PM
127 వీక్షణలు

కష్టజీవుల హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులే : చెరుపల్లి సీతారాములు

కష్టజీవుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసేది కమ్యూనిస్టు పార్టీలేనని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాల పట్టణంలో శుక్రవారం నిర్వహించిన కామ్రేడ్ నారబోయిన సత్తమ్మ సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమాలు బలంగా ఉన్నప్పుడే పాలక ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. చిట్యాల రైస్‌మిల్లు డ్రైవర్లు, కార్మికుల హక్కుల కోసం తన భర్త నారబోయిన భిక్షమయ్యతో కలిసి సత్తమ్మ ఎన్నో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. అనంతరం సత్తమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, సరోజ, మండల నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, ఐతరాజు యాదయ్య, అక్కెనపల్లి నాగయ్య, బూర్గు కృష్ణవేణి, చింతపల్లి కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం, జిల్లా నాయకులు దండెంపల్లి సత్తయ్య, రమేష్, నారబోయిన శ్రీను, మమత తదితరులు పాల్గొన్నారు.