BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 10:01 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / వెలిగండ్ల
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
17 Nov, 2026 - 10:01 PM
10 వీక్షణలు

వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలి: డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్

ప్రకాశం జిల్లా | వెలిగండ్ల | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

వెలిగండ్ల మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌ను స్థానిక పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే పంచాయతీ ఎన్నికలు, పార్టీ బలోపేతం, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణపై పలు అంశాలను చర్చించారు.

ఈ సందర్భంగా డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించాలని తెలిపారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గోన జమేష్, గిద్ద తిరుపతయ్య, కారుమంచి సిదయ్య, మీనిగా బాలయ్య, జమ్ముల లక్ష్మయ్య, కొప్పుల లక్ష్మయ్య, మెడిబోయిన నారాయణ తదితరులు పాల్గొన్నారు.