వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం దుకాణాలు బంద్
తెలంగాణ
/
హన్మకొండ
వరంగల్: వినాయక నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
బుధవారం మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించిన అధికారులు, తిరిగి ఈ నెల 24న దుకాణాలను తెరవాలని సూచించారు.
నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రజలు పోలీసు, ఎక్సైజ్ శాఖల సూచనలను పాటిస్తూ శాంతియుతంగా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులు కోరారు.