BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 08:59 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో భక్తిశ్రద్ధలతో వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Nov, 2026 - 08:59 AM
25 వీక్షణలు

18 పవిత్ర మెట్లకు ప్రత్యేక అలంకరణ.. భక్తిపాటలతో ఆధ్యాత్మిక వాతావరణం పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ప్రగతి పాఠశాల ప్రాంగణంలో శనివారం రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి నామస్మరణతో పాఠశాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ పూజా కార్యక్రమానికి గుంత వెంకటేశ్వర్లు గురుస్వామిగా వ్యవహరించగా, శివాలయం అర్చకులు దాములూరి సత్యనారాయణ శర్మ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత శ్రీ గణపతి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామివార్లకు వివిధ రకాల పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు సమర్పించారు. అనంతరం అయ్యప్ప మాలధారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పవిత్రమైన 18 మెట్లను పసుపు, కుంకుమ, గంధం, వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఒక్కో మెట్టుకు భక్తిపూర్వకంగా పూజలు నిర్వహిస్తూ దీపారాధన చేసి కర్పూర హారతులు సమర్పించారు. అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహానికి వివిధ రకాల పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తబృందం ఆలపించిన అయ్యప్ప స్వామి భక్తిగీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామివారి నామస్మరణ, భజనలతో కార్యక్రమ ప్రాంగణమంతా భక్తిమయంగా మారింది. పడిపూజకు విచ్చేసిన అయ్యప్ప మాలధారులు, భక్తులకు ప్రగతి పాఠశాల కరస్పాండెంట్ వెదురు వెంకటరెడ్డి దంపతులు భక్తితో అల్పాహార వితరణ (బిక్ష) ఏర్పాటు చేశారు. భక్తులకు ఆతిథ్యం అందిస్తూ కార్యక్రమం విజయవంతంగా ముగిసేందుకు సహకరించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని భక్తులు ప్రార్థించారు.